Header Banner

శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్‌..! ప్రయాణికులకు కీలక సూచనలు!

  Fri May 09, 2025 18:43        India

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా వలయాన్ని అధికారులు మరింత పటిష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) బలగాల నిఘాను మరింత పెంచారు. ఇరవై నాలుగు గంటల పాటు విమానాశ్రయ కార్యకలాపాలను డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్ వర్గాలు, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) పోలీసులతో నిరంతర సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. విమానాశ్రయం లోపల, వెలుపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విమాన ప్రయాణికులకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు.

ప్రయాణం చేయదలచిన వారు తమ విమానం బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని కోరారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అందిన స్పష్టమైన ఆదేశాల మేరకు ప్రయాణికులను, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉత్తర భారతదేశంలోని కొన్ని కీలక నగరాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. వీటిలో శ్రీనగర్, అమృత్‌సర్, జోధ్‌పుర్‌, చండీగఢ్‌, రాజ్‌కోట్‌లకు వెళ్లే విమానాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టులో భారీ ఉద్యోగాలు! మెట్రిక్ నుంచి డిగ్రీ అర్హతతో.. ఇక ఆలస్యం చేయొద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ShamshabadAirport #HighAlert #HyderabadAirport #PassengerAdvisory #SecurityAlert #FlightUpdates #TravelAlert